గురువారం భీమవరం పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీమంత్రి తనుకు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం, జగన్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.