ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోలియో చుక్కలు దోహదం చేస్తాయి.. చదలవాడ నాగరాణి

1667చూసినవారు
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, పోలియో వంటి ప్రమాదకర వ్యాధి నుంచి చిన్నారులను శాశ్వతంగా రక్షించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో పోలియో చుక్కలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్