తణుకు విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తు పనులు చేపట్టనున్నందున శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వేల్పూరు రోడ్డు, ఎస్సీ కాలనీ, గణేష్ చౌక్, టీచర్స్ కాలనీ, ఉండ్రాజవరం జంక్షన్, ఐక్య నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ అంతరాయంపై వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.