పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత
భారత్ లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కె. కిషోర్, ఏఎన్ఎంలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.