పెంపుడు జంతువులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి - ఎమ్మెల్యే రాధాకృష్ణ

2చూసినవారు
పెంపుడు జంతువులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి - ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పెంపుడు జంతువులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వాటికి సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం తణుకులో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, పెంపుడు జంతువులతో అనుబంధం ఎంత ముఖ్యమో, వాటి ఆరోగ్యం, పరిశుభ్రత, సమయానుకూల టీకాలు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.