తణుకు పట్టణంలో 30 యాక్ట్ ఉల్లంఘించి, అనుమతి లేని ర్యాలీ నిర్వహించినందుకు మాజీ మంత్రి కారమూరి వెంకట నాగేశ్వరరావుతో పాటు 30 మంది కార్యకర్తలపై తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు ఈ చర్యలు తీసుకున్నామని, మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.