తణుకు వైయస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి సాయిబాబా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. శుక్రవారం వైయస్సార్సీపీ నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని, ప్రజల కోసం చేస్తున్న పోరాటాలపై కక్ష సాధింపులు తగదని ఆయన
టీడీపీ నాయకులను హెచ్చరించారు. తణుకులో అక్రమ పేకాట క్లబ్బులు,
క్రికెట్ బెట్టింగులు నడుస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోకుండా కొత్త సీఐ వైయస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం హాస్యాస్పదమని సాయిబాబా రెడ్డి తెలిపారు.