
నందిగామలో టోనా చేప.. కేజీ ఎంతంటే!
నందిగామ మాంసం మార్కెట్లో 50 కిలోల బరువున్న టోనా చేప విక్రయానికి రావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. లోతైన సముద్రాల్లో లభించే ఈ చేప రుచి ప్రత్యేకంగా ఉంటుందని విక్రయదారులు తెలిపారు. కిలో రూ. 500 నుంచి రూ. 800 వరకు ధర పలుకుతున్నప్పటికీ, మాంసాహార ప్రియులు ఈ చేపను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.





































