
శ్రీనివాస్ ని సత్కరించిన చైర్మన్ నాగరాజు
ఉండి వ్యవసాయ అధికారి నిమ్మల శ్రీనివాస్ ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్నందుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు సోమవారం ఆయనను సన్మానించి, అభినందించారు. శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ కష్టపడి పని చేసే వారికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుందని అన్నారు.








































