ఆకివీడు మండలం గుమ్ములూరు శివారులో కోడిపందేలు ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,050 నగదు, ఒక కోడి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. మండలంలో జూదం, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.