పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణ రెడ్డి, కార్యదర్శి రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ గిరిజనుల కోసం ఆయన తపనను కొనియాడారు. డాక్టర్ రంగరాజు, రూత్ కళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.