ఆంధ్రా బాడీబిల్డర్లకు చెన్నైలో ఘన విజయం

256చూసినవారు
ఆంధ్రా బాడీబిల్డర్లకు చెన్నైలో ఘన విజయం
తమిళనాడులోని చెన్నైలో జరిగిన 39వ సౌత్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తా చాటారు. 55 కేజీల విభాగంలో లోకేష్, 60 కేజీల్లో సాయి, 70 కేజీల్లో ప్రశాంత్, 75 కేజీల్లో భాస్కర్, 85 కేజీల్లో విక్రమ్, 90 కేజీల్లో బాబి విజయం సాధించారు. 280 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్గా భాస్కర్, ద్వితీయ స్థానంలో విక్రమ్, తృతీయ స్థానంలో ప్రశాంత్ నిలిచి రాష్ట్రానికి పేరు తెచ్చారు. ముంబైలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ ఆంధ్రప్రదేశ్ బాడీబిల్డర్లు విజయం సాధించాలని అసోసియేషన్ అధ్యక్షులు K. సుబ్రహ్మణ్యం, జనరల్ సెక్రటరీ B. శ్రీనివాస్ చౌదరి ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్