భీమవరంలో K.12 జిమ్ బొల్లా క్లాసిక్ కప్, మిస్టర్ భీమవరం బాడీబిల్డింగ్ పోటీలు విజయవంతంగా జరిగాయని న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందించారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ దాసి వరప్రసాద్, సీనియర్ బాడీ బిల్డర్ బొల్లా శ్రీను, బాబి, ప్రేమ్ కుమార్, కాజి, రిచి, ఆర్కె, విజ్ఞాన వేదిక అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు.