విస్సాకోడేరు లో ఇళ్ల నిర్మాణాల లేఅవుట్ ను తనిఖీ చేసిన కలెక్టర్

445చూసినవారు
విస్సాకోడేరు లో ఇళ్ల నిర్మాణాల లేఅవుట్ ను తనిఖీ చేసిన కలెక్టర్
పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో ఇళ్ల నిర్మాణాల లేఅవుట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆప్షన్ త్రీ క్రింద 3,600 ప్లాట్స్ కు గాను 2,150 ఇళ్ళు మంజూరు చేయగా, ఇప్పటివరకు 231 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఉగాది నాటికి 1,900 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you