IIITలో సీటు సాధించిన సాయిపల్లవికి అభినందనలు

1340చూసినవారు
IIITలో సీటు సాధించిన సాయిపల్లవికి అభినందనలు
ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలోని శ్రీ గాదిరాజు అప్పల నరసింహరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మండలంలో ప్రథమ స్థానం సాధించిన చెన్నంశెట్టి సాయిపల్లవి, IIIT (ట్రిపుల్ IT) ఇడుపులపాయ క్యాంపస్‌లో సీటు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు M. జాన్ బాబు ఆదివారం తెలిపారు. సాయిపల్లవిని గ్రామ సర్పంచ్, పేరెంట్స్ కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. ఈ విజయం పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి ప్రాంతానికి గర్వకారణం.

సంబంధిత పోస్ట్