ఉండి మండలం, మహాదేవ పట్నం రామచంద్రపురంలో రూ. 13.50 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ స్కూల్ నూతన భవనాన్ని మంగళవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ జుత్తిగ నాగరాజు కూడా పాల్గొన్నారు.