అన్నదాన భవన నిర్మాణానికి రూ.1,11,111 విరాళం

611చూసినవారు
అన్నదాన భవన నిర్మాణానికి రూ.1,11,111 విరాళం
కాళ్ల మండలం కాళ్ళకూరులోని స్వయంభూః శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదాన భవన నిర్మాణానికి కోనలపల్లి వాస్తవ్యులు గ్రంధి.పెద్దిరాజు, నాగమణి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటేశ్వర్లు, జ్ఞాన ప్రసన్న, రాజేష్ తేజ రూ.1,11,111/- (ఒక లక్ష పదకొండువేల నూట పదకొండు రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు శ్రీ అడ్డాల.శివరామరాజు, కార్యనిర్వహణాధికారి సమక్షంలో బుధవారం అందజేశారు. దాతలను అభినందించి, వారికి స్వామివారి శేష వస్త్రం, ప్రసాదములు, వేద ఆశీర్వచనం అందజేశారు.

సంబంధిత పోస్ట్