రాజమహేంద్రవరంలో పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం తెలుగు స్వర్ణ నంది పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఆకివీడుకు చెందిన కవి, నటుడు, తెలుగు భాషోపాధ్యాయుడు డాక్టర్ పెంకి విజయకుమార్ సాహిత్యం, విద్య, కళారంగంలో ఆయన కృషికి గుర్తింపుగా తెలుగు స్వర్ణ నంది జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు, డాక్టర్ కావూరి శ్రీనివాసశర్మ, కంచర్ల శ్రీనివాసరావు, మున్నెల్లి శివశంకరయ్యలు పాల్గొన్నారు.