స్థానిక
ఎన్నికలు నేపథ్యంలో ఉండి మండలంలో మొత్తం 19 ఎంపిటీసి స్థానాలకు, ఒక జడ్పి స్థానాకి బుధవారం
ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 5 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 14 స్థానాలలో పోటీ జరుగుతుంది. కూటమిలో ఉన్న టిడిపి 9,
జనసేన 5, మొత్తం 14 స్థానాలలో ఉండగా వైసిపి 14 స్థానాలలో తలపడుతుంది. స్వతంత్ర అభ్యర్థులు 5 మంది పోటీలో ఉన్నారు. ఏకగ్రీవం అయిన స్థానాలు కోలమూరు, యండగండి, చిలుకూరు, వాండ్రం ఉండి - 3 ఉన్నాయి.