పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛ రథం దోహదపడుతుందని సర్పంచ్ కొండవీటి సాంబశివరావు అన్నారు. కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ప్రతీ గ్రామం పర్యటించి పొడి చెత్తను సేకరించడం జరుగుతుందని, సేకరించిన చెత్తకు ప్రతిఫలంగా నిత్యావసరాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అడపా గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.