సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛ
భారత్ వంటి బాపూజీ ఆశయాలను ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని రాష్ట్ర శాసన ఉప సభాపతి, ఉండి నియోజకవర్గం శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెద అమిరంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద గాంధీజీ 150 వ జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. తొలుత గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.