రాష్ట్ర ఉప సభాపతి, ఉండి శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కోట్ల కన్వెన్షన్ సెంటర్లో ఆక్వా ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్వా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆక్వా రైతు అధ్యక్షులు గాంధీ రాజు, ఆక్వా ఇంటర్నేషనల్ పత్రిక, ఎగ్జిబిషన్ నిర్వాహకులు నజీర్ తో పాటు పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు.