, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం, కలవపూడి సచివాలయాన్ని గురువారం జేసి టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కలవపూడి గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల నమోదు, ప్రజలకు అందిస్తున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే రికార్డులను తనిఖీ చేసి, సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు.