పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

6చూసినవారు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో జరుగుతున్న ఎంపిటిసి మరియు జెడ్పిటిసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనశ్రీ స్వయంగా పర్యవేక్షించారు. ఉండిలోని ఎస్‌జిఎం పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు మరియు ఎన్నికల సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు. ఈ పర్యటనలో ఉండి ఎన్నికల అధికారి మురళీకృష్ణ, తహసీల్దార్ మంతెన రామ్ ప్రసాద్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్