ఉండి మండలం చెరుకువాడకు చెందిన వే టు న్యూస్ జర్నలిస్ట్ గాదిరాజు రంగరాజుకు కర్ణాటక రాష్ట్రం సార్వత్రిక విశ్వవిద్యాలయం మైసూరులో కర్ణాటక గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ తావార్ చంద్ గేహ్లాట్ డాక్టరేట్ పట్టాను శనివారం ప్రధానం చేశారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నాటక రంగ వికాసం పై పరిశోధన చేసి ఈ పట్టాను పొందారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్ లర్ శర్వణ వి హలసే, గైడ్, అకడమిక్ డీన్ ఎం రామన్నాధం నాయుడు తదితరులు పాల్గొన్నారు.