పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరులో అగ్నిప్రమాదానికి గురైన బాధితులకు శనివారం లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థలు అండగా నిలిచాయి. వారికి నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాలు, దుప్పట్లు, రగ్గులు, గృహోపకరణాలు, కొంత నగదును అందించారు. MRO ప్రసాద్ రాజు, నారాయణరెడ్డి, నరసరాజు, రూత్ కళ, డా. రంగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సహాయక చర్యలు బాధితులకు కొంత ఊరటనిచ్చాయి.