ప. గో. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జుత్తుగ నాగరాజు ఆదివారం ఉండిలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నాయకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు చినబాబు పాల్గొన్నారు. నూతన పాలకవర్గం గ్రంథాలయాల అభివృద్ధికి, పఠనాభిలాషను పెంపొందించడానికి కృషి చేయాలని వక్తలు ఆకాంక్షించారు.