ఆకివీడులో కొనసాగుతున్న పోలీస్ పికెట్

329చూసినవారు
ఆకివీడులో కొనసాగుతున్న పోలీస్ పికెట్
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో గురువారం పోలీస్ పీకేట్ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. రామాలయం వద్ద 12 మంది ఎస్సైలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఆకివీడులో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఆందోళనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్