పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలిసిపూడిలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు. కలిసిపూడి, అర్తమూరు గ్రామాల MPTC సభ్యులు, మానవత సంస్థ కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు చిన్నారికి పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిండు జీవితానికి పోలియో చుక్కలు శ్రీరామరక్షగా నిలుస్తాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.