గుమ్మలూరు జనసేన అధ్యక్షుడికి షోకాజ్ నోటీసు జారీ

4చూసినవారు
గుమ్మలూరు జనసేన అధ్యక్షుడికి షోకాజ్ నోటీసు జారీ
ఉండి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ జుత్తుగ నాగరాజు, గుమ్మలూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు కడియం సుబ్రహ్మణ్యానికి బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుబ్రహ్మణ్యాన్ని ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, ఇలాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నాగరాజు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్