1963 జనవరి 31న భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించిందని HM కొల్లాబత్తుల సూర్య కుమార్ తెలిపారు. పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో ఆయన విద్యార్థులకు ఈ విషయాన్నిశనివారం వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన రెండు నెమలి చిత్రాలున్న పది రూపాయల నోటును ఆయన ప్రదర్శించారు. మన జాతీయ పక్షి నెమలి సంతతిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు.