నెల్లూరులో జరిగిన 8వ ఏపీ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగ విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. పెంటపాడుకు చెందిన కోడి స్నేహలత లాంగ్ జంప్‌లో మూడవ స్థానం సాధించగా, మోగల్లు జెడ్పీహెచ్ పాఠశాలకు చెందిన కోడి శ్రీరామ కృష్ణ వర్మ రన్నింగ్‌లో మూడవ స్థానం పొందారు. వీరిని ఎస్ఎస్ఏ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి. శ్యాంసుందర్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ టి. శ్రీనివాస్ అభినందించారు.