ఉండి మండలం NRPఅగ్రహారంలో PSటీచర్ గా పనిచేస్తున్న సోడాబత్తుల వెంకటరత్నంపై గుర్తు తెలియని వ్యక్తి దాడిచేశాడు. కాళ్ళ మండలం పెదఅమిరం లిబర్టీ ఎదురుగా లేఅవుట్లో ఉదయం సైకిల్ పై వ్యాయామం చేస్తుండగా అజ్ఞాత వ్యక్తి దాడి చేసినట్లుగా బంధువులు తెలిపారు. అనంతరం తమ సోదరుడుకి ఫోన్ చేయగా ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారన్నారు. కాళ్ళ పోలీసులు కేసు నమోదు చేశారు.