తెలుగుదేశం కూటమి సంక్షేమ, అభివృద్ధి కరపత్రాల పంపిణీ

5చూసినవారు
తెలుగుదేశం కూటమి సంక్షేమ, అభివృద్ధి కరపత్రాల పంపిణీ
ఆకివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యూనిట్ 9&10 బూత్ కన్వీనర్ల సమావేశం క్లస్టర్ ఇంచార్జ్ గోంట్లా గణపతి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి పై కరపత్రాలను ఇంటింటికి తెలుగుదేశం కూటమి నాయకులను కలుపుకుని అవగహన కల్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం లో ఆకివీడు రూరల్ బ్యాంకు చైర్మన్ మోటుపల్లి రామవర ప్రసాద్, మండల అధ్యక్షులు కోపల్లె సాయిబాబు, యూనిట్ ఇన్చార్జి మోటుపల్లి సత్యనారాయణ, యండి జాకీర్, వార్డ్ ఇన్చార్జి అడపా అబ్బులు, యండి ఆరిఫ్, వెలివల శివ, మోటుపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్