పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో, గత పది రోజులుగా ఎమ్మార్వో కార్యాలయం వద్ద సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్న గ్రామ సహాయకులు, సోమవారం స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజుకు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసం వినతి పత్రం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.