స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ హబ్‌ను సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి కలెక్టర్ నాగరాణితో కలిసి వాలీబాల్ హబ్‌ను ప్రారంభించిన ఆయన, గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభకు కొదవ లేదని, సరైన వసతులు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. యువత దురలవాట్లకు దూరంగా ఉండి, క్రీడల వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు.