రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భీమవరం పర్యటన సందర్భంగా, ఉండి మెయిన్ సెంటర్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణకు వైసిపి నాయకులు గురువారం ఘన స్వాగతం పలికారు. ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జగ్గురోతు విజయ్ కుమార్, రణస్థుల మహంకాళి, మోటుపల్లి గంగాధర్, గుల్లిపల్లి అచ్చారావుతో పాటు పలువురు వైసిపి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.