ద్వారకాతిరుమలను నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేయాలి

525చూసినవారు
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని నిర్ణయం తీసుకుని, ఈ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో పెట్టి ఆమోదించనున్నారని తెలిపారు. ద్వారకాతిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్