ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏలూరు డీఎస్సీ శ్రావణ్‌కుమార్ ఆదేశించారు. ఉంగుటూరు మండలం వెల్లమిల్లి పోలింగు కేంద్రాన్ని బుధవారం రాత్రి ఆయన పరిశీలించారు. ఎస్సై సూర్యభగవాన్ కు, ఎన్నికల అధికారులకు పలు సూచనలిచ్చారు. ఓటర్లు ప్రశాంతంగా ఓట్లు వేసుకునేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మక గ్రామాలపై ఎస్సైతో డీఎస్పీ సమీక్షించారు.