హాస్టల్ నుంచి తరలిస్తున్న సరుకులు, బియ్యం పట్టివేత

416చూసినవారు
శుక్రవారం రాత్రి వేలేరుపాడు మండలం శివాకాశీపురంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల హాస్టల్ వార్డెన్ బియ్యం, కంది పప్పు, నూనె, కోడిగుడ్లు అక్రమంగా తరలిస్తుండగా జనసేన నాయకులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హాస్టల్ లోపల మరో వాహనం ఉన్నట్లు మండల అధ్యక్షుడు గణేషుల ఆదినారాయణ అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్