ఉంగుటూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న 33 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ. 29,19,933 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 1,149 మంది లబ్ధిదారులకు రూ. 8,28,96,520 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.