భీమడోలు మండలం గుండుగొలను పీహెచ్‌సీలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గర్భిణీల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలను, డెలివరీ రూంలో ఏసీని ప్రారంభించారు. ఆసుపత్రి సేవలను పరిశీలించి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో 65 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం నిర్వహించారు. త్వరలో ఇన్వర్టర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు దాతలు తెలిపారు.