ఏలూరు, ఉంగుటూరులో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ చుక్కలు శాశ్వత వికలాంగత్వాన్ని నివారిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఉంగుటూరు గ్రామంలోని స్థానిక కమ్యూనిటీ హాల్‌లో జరిగింది.