ఉంగుటూరు యుటిఎఫ్ మండల శాఖ, 12వ పిఆర్సి కమిషన్ వెంటనే నియమించాలని, 29% మధ్యంతర భృతి ప్రకటించాలని, 2003 టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డుల ఉద్యమం ద్వారా తమ డిమాండ్లను గురువారం తెలియజేసింది. ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ హై స్కూల్ కాగుపాడు పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పూర్వ అధ్యక్షులు ఎస్కే ముస్తఫా ఆలీ, జిల్లా కార్యదర్శి సీహెచ్ శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు వెలిచెర్ల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీతాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డాకి జోగినాయుడు పాల్గొన్నారు.