భీమడోలు సెక్షన్ పరిదిలోని 33/11 కేవీ గుండుగోలను సబ్-స్టేషన్ పరిదిలో మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 7 నుంచి 10 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివాజీ శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే గుండుగోలను హెడ్ క్వార్టర్ ఫీడర్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ అంబేడ్కర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.