ఉంగుటూరులో పంట పొలాల పక్కన ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి మందిరం వద్ద శుక్రవారం రైతులకు, పాదచారులకు సౌకర్యార్థం రైతు విశ్రాంతి షెడ్డును ఏర్పాటు చేశారు. ఈ షెడ్డు వద్ద పూజకు సంబంధించిన పత్రి అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్ర స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాత్రి వేళల్లో మద్యం సేవించి అపరిశుభ్రం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు రౌతు రామకృష్ణ హెచ్చరించారు. రావులపర్రు రహదారిలో ఈ షెడ్డును ఏర్పాటు చేశారు.