భీమడోలులో టిడిపి ఆవిర్భావ దినోత్సవం

254చూసినవారు
భీమడోలులో టిడిపి ఆవిర్భావ దినోత్సవం
ఏలూరు జిల్లా భీమడోలులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గన్నే వీరాంజనేయులు పాల్గొన్నారు. ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 'జోహార్ అన్న ఎన్టీఆర్' అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :