ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని సీనియర్ సిటిజన్స్ జాతీయ సంఘం కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు విశ్రాంత అధికారి వెంపరాల నారాయణమూర్తి అన్నారు. గురువారం చేబ్రోలులో ఆయన ఓటేశారు. తన 86 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు వివిధ రకాల ఎన్నికల్లో 50 సార్లు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నానన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే వారిని యువత ఎన్నుకోవాలిఅని కోరారు.