ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం గోపీనాథ పట్నం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ రకాల ఉద్యానవన పంటల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో అధికారులు ఆయనకు వివిధ రకాల చిరుధాన్యాలతో తయారుచేసిన చిత్రపటాన్ని అందజేశారు.