సోమవారం ఉంగుటూరు మండలం కైకరంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యాలు, విద్యా స్థాయిలను పరిశీలించిన ఆమె, దోమల నియంత్రణ నెట్లను ధ్వంసం చేసినట్లు గుర్తించి వార్డెన్‌ను ప్రశ్నించారు. క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థులకు సూచించారు.